News January 22, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతల వివరాలు

కామారెడ్డి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత అధికమై ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. జిల్లాలో అత్యల్పంగా మేనూర్ 9.6, జుక్కల్ 9.7, గాంధారి 9.5, లచ్చపేట 10.8, సర్వాపూర్, వెల్పుగొండలో 11.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది.
Similar News
News February 18, 2025
KMR: చింత చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి

చింత చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంసాగర్‌లో జరిగింది. ఎస్ఐ శివకుమార్ వివరాల ప్రకారం ఆదివారం కర్రే లింగయ్య(31) మేకలకు మేత కోసం చింత చెట్టుపై నుంచి జారిపడడంతో తలకు గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం హైదారాబాద్ తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2025
మా వాళ్లు సెమీస్‌కు వెళ్తే గొప్పే: కమ్రాన్ అక్మల్

పాక్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ తన సొంత దేశంపై విమర్శలు గుప్పించారు. పాక్ జట్టు సెమీస్ వరకూ వెళ్తే గ్రేట్ అంటూ ఎద్దేవా చేశారు. ‘మా జట్టులో చాలా లోపాలున్నాయి. సరైన స్పిన్నర్లే లేరు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లోనూ సమస్యలే. సెలక్షనే సరిగ్గా లేదు. నా దృష్టిలో ఇండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్‌కు చేరతాయి. మా జట్టు సెమీస్‌కు చేరితే అది గొప్పే’ అని వ్యాఖ్యానించారు.
News February 18, 2025
ఆరు వసంతాల అభివృద్ధిలో ములుగు

2019 ఫిబ్రవరి 17న ఏర్పడిన ములుగు జిల్లా నిన్నటితో 6 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఆరేళ్లలో జిల్లాలో అంతర్గత రోడ్ల నిర్మాణం, జిల్లాలో పారామెడికల్, మెడికల్ కాలేజీ ఏర్పాటు, నూతన కలెక్టరేట్ భవన నిర్మాణం, జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైన రామప్ప లక్నవరం, బోగత జలపాతాల అభివృద్ధి జరిగింది. జిల్లాలో పలు ఐటి,మౌలిక పరిశ్రమలు ఏర్పాటు కోసం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.