News February 19, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

*జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
* విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్
* మెరుగైన వైద్య సేవలు అందించాలి: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
* లింగంపేట్ PS కు కొత్త సారొచ్చారు
*MLC ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: మంత్రి జూపల్లి
* కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7ఏళ్ల శిక్ష..
* BJP నిరుద్యోగులను మోసం చేసింది: TPCC చీఫ్
* వసతుల కల్పనకు ప్రాధాన్యం: రైల్వే జీఎం
Similar News
News October 19, 2025
మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం!

AP: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హెలిప్యాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో పాస్ల జాబితాలో లేని ఇద్దరు వ్యక్తులు భద్రతా వలయంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీఐపీ పాస్లు తీసుకుని బీజేపీ నేతల పేర్లతో ట్యాంపర్ చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత భారీ భద్రత ఉన్నా ఇలా జరగడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
గీసుగొండ: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. గొర్రెకుంట బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ల్యాదెళ్ల రాజు(38)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News October 19, 2025
HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్ పేరుతో మోసం

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్ ఐటీ ఇంజినీర్ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్డీ లెటర్హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్కు బదిలీ చేశారు.