News February 26, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి టాప్ హైలెట్స్

image

=> మైనర్లకు కల్లు విక్రయించొద్దు: కామారెడ్డి ASP => నాగిరెడ్డిపేట: అడవులకు నిప్పు అంటించవద్దు: ఫారెస్ట్ రేంజ్ అధికారి =>సదాశివనగర్‌లో పర్యటించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ =>కామారెడ్డి:వచ్చే నెల 8న లోక్ అదాలత్ =>MLC ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు:SP =>94 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగం =>పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్

Similar News

News December 9, 2025

భారత్‌లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి

image

ఆసియాలోనే తమ అతిపెద్ద పెట్టుబడి భారత్‌లో పెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ప్రకటించారు. ఇండియాలో AIకి ఊతమిచ్చేలా 17.5 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో ఉన్న ఫొటోను షేర్ చేసిన ఆయన.. దేశంలో AI అభివృద్ధికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్స్ కోసం ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు.

News December 9, 2025

జిల్లాకు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించాలి: ఎంపీ

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే నిర్మించాలని అమలాపురం ఎంపీ హరీశ్ లోక్‌సభలో 377 నిబంధన ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య సదుపాయాల లోపం, ట్రామా కేంద్రాలు లేకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిస్థితి సరిగా లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు. మంజూరైన క్యాన్సర్ డే సెంటర్‌ను వేగంగా నిర్మించాలని ఎంపీ కోరారు.

News December 9, 2025

చిత్తూరు: హైవేల అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్

image

కుప్పం, కాణిపాకం జాతీయ రహదారుల అనుసంధానానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. కుప్పం, హోసూర్, బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే, కాణిపాకం టెంపుల్ లింక్ రోడ్డు-NH 140 సంబంధించి కనెక్టివిటీ అంశాన్ని కేంద్రానికి సమర్పించగా ఆమోదం తెలిపినట్టు చెప్పారు. దీంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.