News February 26, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి టాప్ హైలెట్స్

=> మైనర్లకు కల్లు విక్రయించొద్దు: కామారెడ్డి ASP => నాగిరెడ్డిపేట: అడవులకు నిప్పు అంటించవద్దు: ఫారెస్ట్ రేంజ్ అధికారి =>సదాశివనగర్‌లో పర్యటించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ =>కామారెడ్డి:వచ్చే నెల 8న లోక్ అదాలత్ =>MLC ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు:SP =>94 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగం =>పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్
Similar News
News March 24, 2025
మద్దిరాల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలో జరిగింది. స్థానికుల, పోలీసుల వివరాలు.. AP కృష్ణజిల్లా నూజివీడు తాలుకాకి చెందిన యాకుబ్(23) MHBD జిల్లాలో ఉంటున్నాడు. ఆదివారం కూలీల కోసం కుంటపల్లికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మూలమలుపు వద్ద అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ఘటనలో స్పాట్‌లోనే యాకుబ్ మృతిచెందాడు. కేసు నమోదైంది.
News March 24, 2025
భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం సోమవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా అలంకరణ చేసి వచ్చిన భక్తులకు విశేష పూజలు, హారతి ఇచ్చి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబంది, భక్తులు ఉన్నారు.
News March 24, 2025
ఎన్టీఆర్: అమరావతిలో సిద్ధమవుతున్న బేస్ క్యాంపులు

రాజధాని అమరావతి పనులు ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు గుత్తేదారు సంస్థలు బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఇటీవల విజయవాడలోని CRDA కార్యాలయంలో రూ.22,607.11కోట్ల పనులకు సంబంధించి లెటర్ ఆయా యాక్సెప్టెన్స్(LOA)ను గుత్తేదారులకు అందజేశారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు ప్రారంభం కాగానే ఆయా సంస్థలు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.