News February 27, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్

image

* KMR జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన ఆలయాలు
* KMR: పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి 
* నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించాలి: KMR కలెక్టర్ 
* పిట్లం: రాజీ కాలేదని కన్నతల్లిని కొట్టి చంపేశాడు
* పిట్లం: స్వర్గానికి మార్గం.. రంజాన్ మాసం
* పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ 
* బుగ్గ రామ లింగేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న షబ్బీర్ అలీ 
* శివాలయాన్ని దర్శించుకున్న జుక్కల్ ఎమ్మెల్యే

Similar News

News February 23, 2026

తలమడుగు: రూ 2,25,000 పలికిన లడ్డు

image

తలమడుగు మండలం బరంపూర్ కొండ పైన గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం రాత్రి ఘనంగా ముగిశాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘అన్నమయ్య లడ్డు’ వేలం పాట భక్తుల మధ్య ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన ఎల్టీ గోవర్ధన్ రెడ్డి ₹2,25000 చెల్లించి ఈ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. స్వామివారి కృపతో లడ్డు దక్కడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

News February 23, 2026

విశాఖ: ప్రభుత్వ కార్యాలయల్లో పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అయితే గతవారం పీజీఆర్ఎస్ నిర్వహించలేదు.

News February 23, 2026

అజిత్ పవార్ హెలికాప్టర్ ప్రమాదం: ఫిబ్రవరి 28 నాటికి రిపోర్ట్!

image

అజిత్ పవార్ మరణానికి కారణమైన హెలికాప్టర్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక ఈ నెల 28 లోపు విడుదల కానున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు. నిబంధనల ప్రకారం నెల రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండటంతో శనివారానికల్లా వాస్తవాలు బయటకు రానున్నాయి. మరోవైపు ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ ఆరోపణలు చేయడంతో ఈ రిపోర్ట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.