News March 12, 2025

కామారెడ్డి జిల్లాలో నేడు ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మంగళవారం మద్నూరులోని సోమూర్లో 37.5°C ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే పిట్లంలో 37.3, మద్నూరులోని మెనూర్లో 37.2, పెద్ద కొడప్గాల్ 37.0, బాన్సువాడలోని కొల్లూరులో 36.8, బిచ్కుంద 36.6, జుక్కల్, నిజాంసాగర్లోని మక్దూంపూర్, పాల్వంచలోని ఎల్పుగొండలో 36.3°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 21, 2025

పెద్దపల్లి: వ్యవసాయ భూమిగా చూపి.. రూ.5.30 లక్షల రైతు భరోసా స్వాహా

image

పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సర్వే నం.584 వ్యవసాయ భూమిపై విద్యాసంస్థ భవనాలు ఉన్నప్పటికీ, ఆ భూమిని వ్యవసాయంగా చూపించి రూ.5.30 లక్షల రైతు భరోసా నిధులను అక్రమంగా పొందారని రాష్ట్రీయ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు జాపతి రాజేష్ పటేల్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దాసరి పుష్పలత పేరుతో ఉన్న ఈ పట్టాదార్ పాస్‌బుక్‌పై విచారణ చేసి, అక్రమ లబ్ధిని రికవరీ చేయాలని ఆయన కోరారు.

News November 21, 2025

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ

image

ములుగు ఓఎస్డీగా శివం ఉపాధ్యాయ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఏటూరునాగారం ఏఎస్పీగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా ములుగు ఓఎస్డీ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌ఛార్జిగా డీఎస్పీ రవీందర్ వ్యవహరిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న అధికారులను నియమించాలని ఉద్దేశంతో శివం ఉపాధ్యాయకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో ఏటూరునాగారం ఏఎస్పీగా మనన్ భట్‌ను నియమించారు.

News November 21, 2025

సిద్దిపేట: ‘మారేడుమిల్లి ఘటనపై విచారణ చేయాలి’

image

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై పౌర హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాగుల భూపతి శుక్రవారం మాట్లాడుతూ.. ఈ ఘటనలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా అధికారులు గుర్తించిన మడవి హిడ్మా, అతని సహచరి రాజక్క (రాజే) సహా పలువురి మరణంపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు.