News March 1, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే కామారెడ్డి వాసులు భయపడుతున్నారు. కామారెడ్డిలో ఇవాళ, రేపు 34 నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 1, 2025
ASF: మహిళలు, చిన్నపిల్లల రక్షణే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

మహిళలు, చిన్నపిల్లల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్న పిల్లల చట్టాలపై షీ టీం, భరోసా టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ 65 హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో 14 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి 2 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.
News March 1, 2025
బోధన్: సాగునీటి సమస్య తలెత్తితే అధికారులదే బాధ్యత: కలెక్టర్

జిల్లాలో ఎక్కడైనా సాగు నీటి సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో కలిసి కలెక్టర్ ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షించారు.
News March 1, 2025
రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.