News September 21, 2024
కామారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దోమకొండ అంబర్పేట్‌కి చెందిన వీణ (23), కోనాపూర్ గ్రామానికి చెందిన సాయి (24) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన సాయి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వీణ సైతం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 5, 2024
NZB: చిన్నారిపై దాడి చేసిన కుక్క
నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో ఆరేళ్ల చిన్నారిపై వీధి కుక్క శుక్రవారం దాడి చేసింది. కిరాణా షాపులో బిస్కెట్ కొనుగోలు చేసి వెళ్తున్న చిన్నారిని గాయపరిచింది. చిన్నారి చెంప, పెదవిపై గాయాలయ్యాయి. చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా అధికారులు స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
News October 4, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్
ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.
News October 4, 2024
పిట్లం: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై తేలాడు..!
ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. స్థానికుల వివరాలిలా..పిట్లం గ్రామానికి చెందిన జంగం విఠల్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెళ్లిన అతను రాక పోయేసరికి కుటుంబీకులు ఎక్కడ వెతికినా జాడ లేదు. శుక్రవారం మారేడు చెరువు వైపు వెళ్లే వారికి చెరువులో విఠల్ శవం తేలియాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు.