News January 24, 2026

కామారెడ్డి: జిల్లాలో ‘బీసీ’లకే అగ్రపీఠం!

image

పురపాలక ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బీసీలకు ప్రాధాన్యత లభించింది. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు జిల్లాలో బీసీల రాజకీయ ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీల్లో మూడు స్థానాలను బీసీలకు కేటాయించారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో రాజకీయంలో అనుభవం ఉన్న ఆశావాహులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

Similar News

News February 18, 2026

పదో తరగతి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పదో తరగతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కట్టుదిట్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి ఉత్తీర్ణత శాతం పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపు, పాఠశాలల్లో తాగునీటి, మరుగుదొడ్ల సౌకర్యాల మెరుగుదల తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

News February 18, 2026

విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

image

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 18, 2026

వేములవాడ: మహిళ అనుమానాస్పద మృతి..!

image

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన వెంగళ రోహిణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణికి వెంగళ దినేష్‌తో 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుందని, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా రోహిణి మరణించిందని స్థానికులు తెలిపారు.