News March 31, 2025
కామారెడ్డి జిల్లాలో మండుతున్న ఎండలు

కామారెడ్డి జిల్లాలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఆదివారం ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. బిచ్కుంద మండలంలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత, నస్రుల్లాబాద్ రామారెడ్డి మద్నూర్లో 40.9, కామారెడ్డి నిజాంసాగర్, గాంధారి మండలాల్లో 40.7, దోమకొండ, పాల్వంచ మండలాల్లో 40.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.
Similar News
News October 26, 2025
దేశం పరువును గంగలో కలిపారు.. బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

MPలో ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యంగా తాకిన ఘటన రాజకీయ విమర్శలకు దారితీసింది. లా అండ్ ఆర్డర్ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని, దేశం పరువును గంగలో కలిపారని అధికార BJPపై కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. CM బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ వివాదాన్ని కావాలనే రాజకీయం చేస్తోందని BJP కౌంటర్ ఇచ్చింది. నిందితుడిపై తక్షణ చర్యలు చేపట్టామని, ఇలాంటి వాటిని సహించేదే లేదని స్పష్టం చేసింది.
News October 26, 2025
వైద్య సిబ్బంది 24hrs అందుబాటులో ఉండాలి: మంత్రి సత్యకుమార్

AP: మొంథా తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టే వరకు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు ఆరోగ్య కేంద్రాల్లో ఉండాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. వాతావరణ సూచనలతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అంబులెన్సులు, ఫీడర్ వెహికల్స్ మ్యాపింగ్ చేశామని వైద్యారోగ్య శాఖ CS సౌరభ్ గౌర్ తెలిపారు. ఎపిడమిక్ సెల్, ఎమర్జెన్సీ టీమ్లు సిద్ధం చేశామన్నారు.
News October 26, 2025
గుంటూరు: ‘ఈ సమస్యలు వస్తే కాల్ చేయండి’

గృహ హింస చట్టం 2006 అక్టోబర్ 26 అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా మహిళల రక్షణ, న్యాయం కోసం అధికారుల పర్యవేక్షణలో కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మహిళలపై హింస, వేధింపులు, దౌర్జన్యాలు ఎదురైనప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో గుంటూరు ప్రాజెక్ట్ డైరెక్టర్ గృహ హింస చట్టం శాఖను సంప్రదించవచ్చు. లీగల్ కౌన్సిలర్ : 8639687689, సోషల్ కౌన్సిలర్: 8074247444.


