News January 19, 2025
కామారెడ్డి జిల్లాలో మరింత తగ్గుదలకు ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో అత్యల్పంగా గాంధారి 11.6,జుక్కల్ 11.7, మేనూర్ 11.9, సర్వాపూర్ 12.5, డోంగ్లి, బీబీ పేట్లో 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. చలి ప్రభావం ఎక్కువ అవుతుంది నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Similar News
News November 24, 2025
HYD: డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి: సీపీ

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక సూచన చేశారు. ‘డిజిటల్ ప్రపంచంలో భద్రత తప్పనిసరి. మీ డేటా, మీ జీవితానికి కీలకం. దాన్ని మీరే కాపాడుకోవాలి. డేటా చోరీ జరిగితే, ఆలస్యం చేయకుండా వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి’ అని Xలో ట్వీట్ చేశారు.
News November 24, 2025
వరంగల్: తపాలా శాఖ ఫిర్యాదుల స్వీకరణ

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజల నుంచి తపాలా శాఖకు సంబంధించి ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్లు హనుమకొండ పోస్టల్ సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. 52వ డాక్ అదాలత్ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పోస్టల్ కవర్లో కె. శ్రీకాంత్, అసిస్టెంట్ డైరెక్టర్(స్టాఫ్ & విజిలెన్స్) పోస్టుమాస్టర్ జనరల్ హైదరాబాద్ రీజియన్ 500001కు డిసెంబర్ 1లోపు పంపించాలన్నారు.
News November 24, 2025
మధిర: లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

లంచం తీసుకుంటూ మధిర అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ (ALO) కె.చందర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. చనిపోయిన భవన కార్మికుడి పేరిట వచ్చే రూ.1.30 లక్షల ఇన్సూరెన్స్ బిల్లు పాస్ చేయడానికి అధికారి చందర్, మృతుడి భార్యను రూ.15,000 లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో ఖమ్మం రోడ్డులో వల పన్ని, లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.


