News January 19, 2025

కామారెడ్డి జిల్లాలో మరింత తగ్గుదలకు ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో అత్యల్పంగా గాంధారి 11.6,జుక్కల్ 11.7, మేనూర్ 11.9, సర్వాపూర్ 12.5, డోంగ్లి, బీబీ పేట్‌లో 12.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. చలి ప్రభావం ఎక్కువ అవుతుంది నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News February 16, 2025

పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

image

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

News February 16, 2025

లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

image

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.

News February 16, 2025

HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

image

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!