News February 22, 2025
కామారెడ్డి జిల్లాలో వరుస గుండెపోట్లు

KMRలో వరుస గుండెపోట్లు కలకలం రేపుతున్నాయి. 2రోజుల్లో బడికెళ్లే బాలిక, కూతురి పెళ్లిలో తండ్రి ఇలా ఇద్దరు మృతి చెందడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా గుండెపోట్లు రావడం ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఎలాంటి అనారోగ్య కారణాలు లేనివారు గుండెపోటుకు గురయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. మంచి ఆరోగ్య అలవాట్లు మెయిన్టేన్ చేస్తే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు సూచిస్తున్నారు.
Similar News
News December 17, 2025
NTR: భారీగా పెరుగుతున్న ధరలు.!

ఎన్టీఆర్ జిల్లాలో కోడి గుడ్డు ధరలు భారీగా పెరుగుతున్నాయి. కోళ్ల ఫారాల వద్దే గుడ్డు ధర రూ.7 చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో రూ. 8 వరకు విక్రయిస్తుండగా, విజయవాడలో హోల్సేల్ ధర రెండు రోజుల్లో రూ. 215 నుంచి రూ. 225 పెరిగింది. రాబోయే రోజుల్లో గుడ్డు ధర రూ.10కు చేరే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
News December 17, 2025
తుది విడత పోలింగ్.. ఓటేయనున్న 6.28 లక్షల మంది ఓటర్లు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 530 పంచాయతీల్లో 6,28,996 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో 12,517 మంది సిబ్బంది, 5,410 మంది పోలీసులు పాల్గొంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరగనుండగా, 2 గంటల నుంచి లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. ఇప్పటికే 34 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
News December 17, 2025
ఓటమి ఎరగని మానకొండూరు సర్పంచ్ దంపతులు

మానకొండూరు మండల కేంద్రం సర్పంచ్ తాళ్లపల్లి శేఖర్ గౌడ్ దంపతులు 2001 నుంచి ఓటమి లేకుండా విజయం సాధిస్తున్నారు. 2001లో శేఖర్ గౌడ్ ఎంపీటీసీగా, 2006లో ఎంపీపీగా, 2013లో ఆయన భార్య వర్షిణి సర్పంచ్గా గెలిచారు. 2019లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికలలో రాష్ట్రంలోనే అత్యధిక భారీ మెజారిటీ (13,652) ఓట్లు సాధించారు. ఇప్పుడు రెండోసారి సర్పంచ్గా BRS అభ్యర్థి తాళ్లపల్లి వర్షిణి శేఖర్ గౌడ్ ఎన్నికయ్యారు.


