News March 23, 2025
కామారెడ్డి జిల్లాలో వేసవి క్రీడా శిబిరం

కామారెడ్డి జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథం శనివారం తెలిపారు. మే1 నుంచి 31 వరకు 14 సంవత్సరాలలోపు బాలికలకు ఈ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరం నిర్వహించుటకు ఆసక్తి గల జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9618126053 సంప్రదించాలని కోరారు.
Similar News
News December 10, 2025
ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 10, 2025
రహదారుల అభివృద్ధికి రూ.87.25 కోట్లు: ఎంపీ బాలశౌరి

కృష్ణా జిల్లా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం మొత్తం రూ. 87.25 కోట్ల ఎస్ఏఎస్సీఐ (SASCI) నిధులు మంజూరు చేసినందుకు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి కోసం ఫేజ్-1 కింద రూ. 2,123 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీ.ఓ విడుదల చేసిందని ఎంపీ వివరించారు.
News December 10, 2025
NZB: ప్లాట్ ఫాం, రైలు మధ్యలో ఇరుక్కుని వ్యక్తి మృతి

నిజామాబాద్లో ప్లాట్ ఫామ్.. రైల్ మధ్యలో ఇరుక్కొని వ్యక్తి మృతిచెందాడు. నిజామాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్ఫామ్ 3పై రైలు ఎక్కే క్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడ్డాడు. ప్లాట్ఫామ్, రైలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్ర గాయాలై స్పాట్లోనే మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉంటుందని, కుడిచేతి మధ్యవేలు లేదని గుర్తించారు. కేసు నమోదు చేశారు.


