News March 23, 2025

కామారెడ్డి జిల్లాలో వేసవి క్రీడా శిబిరం

image

కామారెడ్డి జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరం నిర్వహించినట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి జగన్నాథం శనివారం తెలిపారు. మే1 నుంచి 31 వరకు 14 సంవత్సరాలలోపు బాలికలకు ఈ శిబిరం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ శిబిరం నిర్వహించుటకు ఆసక్తి గల జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9618126053 సంప్రదించాలని కోరారు.

Similar News

News April 18, 2025

IPL: సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే?

image

పేలవ ఆటతీరుతో SRH నిరాశపరుస్తోంది. 7 మ్యాచులు ఆడి కేవలం రెండే గెలవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి. ప్లేఆఫ్స్‌కు వెళ్లాలంటే మిగతా 7 మ్యాచుల్లో కచ్చితంగా 6 గెలవాలి. ఒకవేళ 5 గెలిస్తే నెట్ రన్‌రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. కానీ ప్రస్తుతం కమిన్స్ సేన NRR -1.217గా ఉంది. ఇది పాజిటివ్‌లోకి రావాలంటే భారీ తేడాలతో విజయాలు సాధించాల్సి ఉంటుంది. మరి SRH ప్లేఆఫ్స్‌కు వెళ్తుందా? కామెంట్ చేయండి.

News April 18, 2025

కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీగా అమర్నాథ్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఆదేశాల మేరకు కడప జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి ఆధ్వర్యంలో కార్యవర్గ నియామకాన్ని చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డిని పార్టీ జిల్లా సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియామక పత్రాన్ని అందజేశారు.

News April 18, 2025

ఆర్మూర్: అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బాలిక సూసైడ్

image

ఆర్మూర్ మున్సిపల్ పరిధి పెర్కిట్‌లో విషాదం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి 16 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. కడుపునొప్పి భరించలేక బుధవారం రాత్రి బాలిక అపార్ట్‌మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు.

error: Content is protected !!