News August 23, 2024

కామారెడ్డి జిల్లాలో 12,603 కుక్కలు 

image

ఈ మధ్య కాలంలో జిల్లాలో వీధి కుక్కల దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో జిల్లాలోని 526 గ్రామపంచాయతీల్లో అధికారులు సర్వే నిర్వహించి కుక్కలను లెక్కించారు. పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 22 మండలాల్లో 12,603 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. సంతాన నిరోధానికి ఆడ కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Similar News

News September 17, 2024

NZB: నిమజ్జనానికి వేళాయె.. సర్వం సిద్ధం.!

image

11 రోజుల పాటు విశేష పూజలందుకున్న లంబోదరుడు మరి కొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నందిపేట మండలంలోని ఉమ్మెడ, బాసర గోదావరి తీరాన ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. నిమజ్జనం సందర్భంగా 2 వెల మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లపై ఆదివారం చంద్ర శేఖర్ రెడ్డి పోలీసు ఉన్నత అధికారులకు సలహా, సూచనలు చేశారు.

News September 17, 2024

వర్ని: కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త

image

భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News September 17, 2024

ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి

image

కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.