News February 19, 2025
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ ఆదేశించారు. కలెక్టర్లతో మంగళవారం CS శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 17 హాబిటేషన్స్‌లో తాగు నీటి సమస్య ఉందని, ఆయా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలన్నారు. రేషన్ కార్డుల వెరిఫికేషన్‌కు సంబంధించి రోజువారి రిపోర్టులు ఇవ్వాలన్నారు.
Similar News
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్‌లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మోడల్ థీమాటిక్ పోలింగ్ స్టేషన్ ఓటర్లను ఆకర్శించింది. యూసుఫ్‌గూడ మారుతీనగర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఓటర్లను స్వాగతించింది. ఉత్సాహంగా, సమ్మిళితంగా పోలింగ్ జరిగినట్లు CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
జూబ్లీ బైపోల్: మోడల్ స్టేషన్‌లో మహిళా ఓటర్ల క్యూ

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో మొత్తం 5 మోడల్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకటైన షేక్‌పేటలోని సక్కు బాయి మెమోరియల్ హైస్కూల్ మోడల్ పోలింగ్ స్టేషన్ నం.19లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు ఓటు వేయడానికి వరుసలో నిల్చున్నారని, ఇది ప్రజాస్వామ్యం ఫరిడవిల్లునట్లే అని CEO_Telangana ట్వీట్ చేసింది.
News November 11, 2025
HYD: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి BRS ఫిర్యాదు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోడ్‌ను ఉల్లంఘిస్తున్నారని BRS ప్రతినిధుల బృందం HYD BRK భవన్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన వారిలో తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తదితరులు ఉన్నారు.


