News March 14, 2025
కామారెడ్డి జిల్లా జడ్జిని కలిసిన ఎస్పీ రాజేష్ చంద్ర

నూతన ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం కామారెడ్డి జిల్లా జడ్జి వీఆర్ఆర్ వరప్రసాద్ను మర్యాదపూర్వకంగా జిల్లా కోర్టులో కలిశారు. అనంతరం ఆయనకు పూల మొక్కను అందజేశారు. అనంతరం జడ్జితో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 31, 2025
ఆసిఫాబాద్: మొంథా తుపాన్ ఎఫెక్ట్.. రైతు ఆత్మహత్య

చేతికి వచ్చిన పంట తుపాన్ ప్రభావంతో నష్టపోయిందని మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గంగన్న కథనం ప్రకారం.. లింగాపూర్(M ) సీతారాంనాయక్ తండాలో తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన రైతు బలిరామ్(59) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పత్తి, మొక్కజొన్న పంట దెబ్బతినడంతో పురుగుమందు తాగాడు. గురువారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందాడు.
News October 31, 2025
విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.
News October 31, 2025
కళ్యాణదుర్గం: బొలెరో బోల్తా.. ఒకరి మృతి

కళ్యాణదుర్గం మండలం గోళ్ల గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శెట్టూరు నుంచి పామిడి వైపు కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం టైర్ పగిలి నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


