News December 31, 2024
కామారెడ్డి జిల్లా REWIND @ 2024
కామారెడ్డి జిల్లాలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన ముగ్గురు MLAలు శాసన సభలో తొలిసారి అడుగు పెట్టారు. KCR, రేవంత్ రెడ్డిని ఓడించిన KVR జాయింట్ కిల్లర్ గా అవతరించారు. జుక్కల్ MLA తోట JAN 26 న కౌలాస్ కోటపై తొలిసారి జాతీయ జెండా ఎగురవేసి కోట ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ ఏడాది చివర్లో.. అడ్లూర్ చెరువులో SI, మహిళా కానిస్టేబుల్, మరో వ్యక్తి మృతదేహాలు లభ్యమైన కేసు TG లోనే సంచలనంగా మారింది.
Similar News
News January 7, 2025
NZB: చైనా మాంజా అమ్మకందారులకు హెచ్చరిక
నిషేధిత చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ టాస్క్ ఫోర్స్, సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి హెచ్చరించారు. చైనా మాంజా వాడడం వలన ప్రజలకు, జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. చైనా మాంజా నిలువ ఉంచినా, అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కొంత మంది ఇప్పటికే హైదరాబాద్ నుంచి NZB కు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉందని, వారు మాంజాను అప్పగించాలన్నారు.
News January 7, 2025
నేడు కామారెడ్డికి మంత్రి జూపల్లి
నేడు కామారెడ్డిలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నట్లు కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు తెలిపారు. కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకారానికి మంత్రి హాజరవుతున్నారని పేర్కొన్నారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొంటారని ఆయన వెల్లడించారు.
News January 6, 2025
NZB: సినిమా ట్రైలర్ రిలీజ్.. ట్రాఫిక్ కష్టాలు
నిజామాబాద్ నగరంలో సోమవారం రాత్రి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ట్రైలర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం రోడ్లు బ్లాక్ చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పాత కలెక్టరేట్ వద్ద ఈవెంట్ నిర్వహించగా పోలీసులు కోర్టు చౌరస్తా నుంచి సీపీ క్యాంపు ఆఫీస్ మీదుగా బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.