News March 28, 2025
కామారెడ్డి: ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. కామారెడ్డికి చెందిన సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఇంజిన్, ట్రాలీకి మధ్య సందీప్ నిలబడగా.. ట్రాక్టర్ చక్రం సందీప్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ గంగారంపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 26, 2025
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

TG: ఇంటర్ పరీక్షల్లో బ్లాంక్ బార్ కోడ్ (బార్ కోడ్ లేని OMR షీట్లు) విధానానికి బోర్డు ముగింపు పలికింది. ఇక నుంచి ప్రింటెడ్ బార్ కోడ్ షీట్లతో ఎగ్జామ్స్ నిర్వహించనుంది. దీంతో పరీక్ష సమయంలో విద్యార్థులు మీడియం, సెకండ్ లాంగ్వేజ్ మార్చుకోవడం కుదరదు. ఏవైనా తప్పులుంటే ఈ నెలఖారులోగా నామినల్ రోల్స్ లిస్టులో సరి చేసుకోవాలి. బ్లాంక్ బార్ కోడ్ వల్ల ఫలితాల ప్రక్రియ ఆలస్యమవుతుండడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.