News March 28, 2025

కామారెడ్డి: ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. కామారెడ్డికి చెందిన సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఇంజిన్, ట్రాలీకి మధ్య సందీప్ నిలబడగా.. ట్రాక్టర్ చక్రం సందీప్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ గంగారంపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 17, 2025

21 నుంచి MBA ఇంటర్నల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో MBA ఇంటర్నల్ పరీక్షలు 21వ తేదిన నిర్వహించనున్నట్లు బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెడ్ ప్రొఫెసర్ జహంగీర్ తెలిపారు. MBA నాలుగో సెమిస్టర్ రెండో ఇంటర్నల్ పరీక్షలను 26వ తేదీలోగా, రోజుకు రెండుకు మించకుండా నిర్వహించాలని కళాశాలల నిర్వహకులకు సూచించారు. ఇంటర్నల్ పరీక్షలకు నూతన విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. యాజమాన్యాలకు ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించాలన్నారు.

News April 17, 2025

వనపర్తి: హక్కులను కాపాడుకోవాలి: పి.జయలక్ష్మి

image

మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి కోరారు. సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.రాజు అధ్యక్షతన గురువారం వనపర్తిలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

News April 17, 2025

వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

image

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

error: Content is protected !!