News September 28, 2024
కామారెడ్డి డాక్టర్ను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు

గాంధారిలో పనిచేసే ప్రభుత్వ వైద్యుడు ప్రవీణ్ను మహారాష్ట్ర పోలీసులు లింగ నిర్ధారణ కేసులో శుక్రవారం అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉద్గిర్ మండలానికి చెందిన ఓ గర్భిణికి లింగనిర్ధారణ చేయడంతో ఉద్గీర్లోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు దానికి కారణమైన డా.ప్రవీణ్ను అరెస్ట్ చేసి విచారణ నిమిత్తం మహారాష్ట్రకు తరలించారు.
Similar News
News November 15, 2025
NZB: జిల్లా ప్రజలకు సీపీ పలు సూచనలు!

జిల్లా ప్రజలకు సీపీ సాయి చైతన్య పలు సూచనలు చేస్తూ శనివారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాలలో విగ్రహ ప్రతిష్టలు, రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకూ డీజే పూర్తిగా నిషేధం అన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగొద్దన్నారు. డ్రోన్స్ ఉపయోగించడానికి & భారీ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని కోరారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 15, 2025
NZB: ‘Unsung Guru’ అవార్డుకు ఫుట్బాల్ కోచ్ నాగరాజు

NZB జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ ఫుట్బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు ‘ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ కోచ్ ఇన్ ఇండియా’ (FFCI) ఆధ్వర్యంలో కోల్కత్తలో 15న నిర్వహించే ఈ అవార్డుల కోసం నాగరాజుకు ఆహ్వానం పంపింది. గ్రాస్ రూట్లో శిక్షణ ఇస్తూ ఫుట్బాల్ క్రీడా ప్రాచుర్యాన్ని, విశిష్టతను పెంపొందించడంతోపాటు అంకితభావంతో శిక్షణను అందిస్తున్నందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
News November 15, 2025
NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.


