News January 28, 2025

కామారెడ్డి : ఢిల్లీలో తెలంగాణ కళారూపాలు

image

తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం ఢిల్లీ వాసులను మంత్రముగ్ధులను చేశాయి. మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో TGకు చెందిన కళాకారులు ‘భారత్‌ పర్వ్‌-2025’లో భాగంగా పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు.TG ప్రఖ్యాత కళాకారులు పేరిణి ప్రకాశ్‌ నేతృత్వంలో TG సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దీపిక పేరిణి బృందంలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమని కామారెడ్డి కళాకారులు అన్నారు.

Similar News

News February 25, 2026

ముఖాన్ని మెరిపించే బ్యూటీ టిప్స్

image

* కలువ పూరేకలు, తేనె, పాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసి అరగంట తర్వాత కడిగేసుకుంటే ముడతలు, మచ్చలూ తగ్గుతాయి. * గులాబీ రేకల ముద్దకు కాసిన్ని పాలు, చెంచా సెనగపిండి కలిపి ముఖానికి, మెడకు రాయండి. పావుగంట ఆరనిచ్చి కడిగితే ముఖం మెరిసిపోతుంది. * మల్లెలను పేస్టు చేసి, అందులో కొబ్బరినూనె కలపాలి. దీన్ని ముఖానికి రాసి పావుగంట సేపు మృదువుగా మర్దనా చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చాలు.

News February 25, 2026

NGKL: ఇంటర్ విద్యార్థులకు కలెక్టర్ ALL THE BEST

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో నేటి నుంచి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ALL THE BEST చెప్పారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని, ప్రతి ఒక్క ఎగ్జామ్‌ రాయాలని సూచించారు. జిల్లాలోని ఇంటర్మీడియట్ సెంటర్లలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు.

News February 25, 2026

నిజామాబాద్: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

image

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 36,963 మంది విద్యార్థుల కోసం 58 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని, 9:05 వరకు మాత్రమే అనుమతిస్తామని డీఐఈవో తెలిపారు. మాస్ కాపీయింగ్ నివారణకు 3 ఫ్లయింగ్, 8 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలులో ఉంటుంది.