News June 11, 2024
కామారెడ్డి: తండ్రిని హత్య చేసిన కొడుకు

జుక్కల్ మండలంలో దారుణం జరిగింది. తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఎస్సై వివరాల ప్రకారం.. సోపూర్ కు చెందిన లాలప్పకు(75) ఇద్దరు కొడుకులు. లాలప్ప తనకున్న భూమిలో కొడుకులకు వాటా ఇచ్చి భిక్షాటన చేస్తున్నాడు. అయితే చిన్న కుమారుడు సుభాష్ చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో తరచూ గొడవపడేవాడు. భూమిని సుభాష్ ఎక్కడ అమ్ముతాడోనని లాలప్ప కొంత భూమి కోడలి పేరుపై మార్చారు. దీంతో కోపం పెంచుకున్న సుభాష్ తండ్రిని హత్య చేశాడు.
Similar News
News November 7, 2025
పసుపు సాగు పొలాలను సందర్శించిన ఎంపీ అర్వింద్

కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పసుపు సాగు పొలాలను ఎంపీ అర్వింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి శుక్రవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి పసుపు ధరల పరిస్థితి, ఆకుల నుంచి నూనె తీసి అదనపు ఆదాయం పొందే యోచన గురించి తెలుసుకున్నారు. అలాగే, బోర్డు శాశ్వత కార్యాలయానికి స్థలం కేటాయింపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఛైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు.
News November 7, 2025
MP అర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు

గత BRS ప్రభుత్వంపై నిజామాబాద్ MPఅర్వింద్ ధర్మపురి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ KCR తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని ఆరోపించారు. KCR కుటుంబం చేసిన పాపానికి CM రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని పేర్కొన్నారు.
News November 7, 2025
NZB: ఐడీఓసీలో “వందేమాతరం” గేయాలాపన

“వందేమాతరం” జాతీయ గేయాన్ని రచయిత బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో వందేమాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అందరూ స్వచ్ఛందంగా పాల్గొని దేశభక్తి భావాన్ని చాటిచెప్పారు.


