News October 13, 2024
కామారెడ్డి: తండ్రి మృతదేహం లభ్యం
తాడ్వాయి మండలం నందివాడలోని ఓ బావిలో చిన్నారులు విఘ్నేశ్ (7), అనిరుధ్(5 ) <<14345635>>మృతదేహాలు లభ్యమైన<<>> సంగతి తెలిసిందే. పోలీసులు, అధికారులు గాలింపు చేపట్టగా తండ్రి శ్రీనివాస్ మృతదేహం లభ్యమైంది. తండ్రితో పాటు చిన్నారుల మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 3, 2024
ఒట్లు తీసి గట్టు మీద పెట్టిన సీఎం: ఎంపీ అర్వింద్
ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఒట్లు వేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ ఒట్లు గట్టు మీద పెట్టేశారని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ విమర్శించారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిపోయాడన్నారు. రైతులకు రుణమాఫీ, బోనస్, కళ్యాణ లక్ష్మితోపాటు బంగారాన్ని మరిచారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.
News November 3, 2024
NZB: చెరువులో మునిగి ఇద్దరు మృతి
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్ప చెరువులో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. . హైదరాబాద్‌కు చెందిన కొందరు ఆదివారం మంచిప్పలోని దర్గాకు వచ్చారు. దర్శనం అనంతరం వీరిలో ఇద్దరు యువకులు సరదగా స్థానిక పెద్ద చెరువులో దిగగా.. నీట మునిగారు. స్థానికులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు చెరువులో గాలించగా ఇద్దరి యువకుల మృతదేహలు లభ్యమయ్యాయి.
News November 3, 2024
SRSP UPDATE: నిలకడగా నీటి మట్టం
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం నిలకడగా ఉంది. ఆదివారం ఉదయం ఎగువ నుండి ఇన్ ఫ్లోగా 4,787 క్యూసెక్కుల నీరు వస్తుండగా అదే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. ఇందులో కాకతీయ కెనాల్ కు 2883, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల (80.5TMC)కు గాను తాజాగా 1091అడుగుల (80.501TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.