News January 25, 2025
కామారెడ్డి: తర్మాకోల్తో అయోధ్య రామాలయం

కామారెడ్డి జిల్లా కృష్ణాజివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కుమ్మరి అక్షర తర్మకోల్తో కట్టిన అయోధ్య రామాలయం అందర్నీ ఆకట్టుకుంటుంది. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల నిర్మించిన అయోధ్య రామాలయంలా తర్మకోల్తో నమూనా అయోధ్య రామాలయాన్ని నిర్మించి అందరి చూపరులను ఆకర్షించింది. ఆమె చేసిన నమూనా అయోధ్య రామాలయాన్ని చూసిన వారంతా మంత్ర ముగ్ధులు అవుతున్నారు.
Similar News
News November 5, 2025
రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 5, 2025
TU: గెస్ట్ ఫ్యాకల్టీకి పోస్టుకు ఇంటర్వ్యూలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని సౌత్ క్యాంపస్ చరిత్ర విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డా.సుధాకర్ గౌడ్ తెలిపారు. సంబంధిత విభాగంలో 55% ఉత్తీర్ణత పొంది ఉండాలన్నారు. నెట్/సెట్/పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ నెల 7న ఉదయం 11.30గం.లకు బిక్కనూర్ సౌత్ క్యాంపస్లో ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించాలి.
News November 5, 2025
నారాయణపురం: కోతుల దాడిలో వ్యక్తికి తీవ్రగాయాలు

కోతుల దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన సంస్థాన్ నారాయణపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తన ఇంటి ఆవరణలో పనిచేస్తున్న శివ స్వామిపై కోతుల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కోతుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో శివ స్వామి కిందపడి తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హైదరాబాదుకు తరలించారు.


