News May 21, 2024

కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 6లోగా ధృవీకరణ పత్రాలు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Similar News

News October 2, 2024

NZB కలెక్టర్‌తో మంత్రి పొంగులేటి, సీఎస్ సమీక్ష

image

రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారి కోసం ప్రయోగాత్మకంగా ఈ నెల 3 నుంచి పైలట్ ప్రోగ్రాం కింద చేపట్టనున్న ప్రయోగాత్మక సర్వేను పక్కగా జరిపించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

News October 1, 2024

NZB: GREAT.. అప్పుడు సర్పంచ్‌గా.. ఇప్పుడు ఉపాధ్యాయుడిగా..!

image

చదువుకు వయసుతో నిమిత్తం లేదని నిరూపించాడు. రాజకీయంలో జిల్లాస్థాయిలో తనదైన ముద్ర వేసుకొని ఇప్పుడు డీఎస్సీలో మంచి ర్యాంకు సాధించి మన్ననలు పొందుతున్నాడు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బీఈడీ పూర్తి చేసిన నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మాజీ సర్పంచ్(2013) నంద అనిల్ నిన్న విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో జిల్లా స్థాయిలో 7వ ర్యాంకు సాధించాడు. సాంఘిక శాస్త్రం విభాగంలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపిక కానున్నాడు.

News October 1, 2024

ప్రమాదవశాత్తు పోచారం కెనాల్‌లో పడి యువకుడి మృతి

image

నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామానికి చెందిన గోరుకుల లక్ష్మణ్ (23) ప్రమాదవశాత్తు పోచారం ప్రధాన కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం లక్ష్మణ్ పోచారం ప్రధాన కాలువలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగిరాలేదు. కాగా సోమవారం సాయంత్రం పోచారం ప్రధాన కాల్వలోశవమై కనిపించినట్లు ఎస్ఐ తెలిపారు.