News May 21, 2024

కామారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

image

బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 2024-25 విద్యాసంవత్సరంలో 3, 5, 8వ తరగతి ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశాలకై దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అంబాజీ తెలిపారు. 3వ తరగతిలో బాలురకు 7, బాలికలకు 4, 5వ తరగతిలో బాలురకు 4, బాలికలకు 2, 8వ తరగతిలో బాలురకు 3, బాలికలకు 2 సీట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జూన్ 6లోగా ధృవీకరణ పత్రాలు గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

Similar News

News December 6, 2024

రేవంత్ ప్రభుత్వానికి సద్బుద్ధి ప్రసాదించాలి: వేముల

image

ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని రక్షించే సద్బుద్ధి ప్రసాదించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అంబెడ్కర్‌‌కు నివాళి అర్పించి  వేడుకున్నారు. హైదరాబాద్‌లోని 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహ ప్రాంగణానికి వెళ్లి నివాళి అర్పించడానికి వీలు లేకుండా తమను హౌజ్ అరెస్ట్‌లు చేస్తున్న ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.

News December 6, 2024

NZB: బాలికపై లైంగిక దాడి.. ఇద్దరి రిమాండ్

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడిని, అతడికి సహకరించిన మరొకరిని రిమాండ్‌కు తరలించినట్లు డిచ్పల్లి CI మల్లేశ్ తెలిపారు. అక్టోబర్ 1న జక్రాన్‌పల్లికి చెందిన యువకుడు ఓ బాలికను నమ్మించి నిర్మల్‌లోని వెంకటసాయి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అక్టోబర్ 31న అజయ్‌ని అరెస్ట్ చేశారు. కాగా లాడ్జ్ మేనేజర్ సత్యనారాయణను గురువారం అరెస్ట్ చేసినట్లు CI వెల్లడించారు.

News December 6, 2024

పిట్లం: ప్రాణాలంటే మరీ ఇంత నిర్లక్ష్యమా..! 

image

పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణికులను తరలించవద్దని అధికారులు పదే పదే చెపుతున్నా..కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు పై చిత్రమే నిదర్శనం. ఇలా ప్రయాణించే పలువురు ప్రమాదాలకు గురై మృతి చెందిన ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేకం ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఓ తుఫాన్ టాప్‌పై ప్రయాణికులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న దృష్యామిది.