News January 28, 2025
కామారెడ్డి: ‘దివ్యాంగులకు రుణాలు ఇవ్వాలి’

దివ్యాంగులకు పలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని రాష్ట్ర వికలాంగుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు భూపతి కోరారు. ఆయన కామారెడ్డి లో మాట్లాడుతూ.. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రాయ్ చంద్రన్ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా కావలసిన పరికరాలు అందించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
Similar News
News December 11, 2025
విశాఖ కోస్టల్ సెక్యూరిటీ సిబ్బందికి ‘ఈ-ఆఫీస్’ శిక్షణ

విశాఖ కోస్టల్ సెక్యూరిటీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ-ఆఫీస్ శిక్షణ కార్యక్రమం జరిగింది. అదనపు ఎస్పీ జీబీఆర్.మధుసూదనరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఎన్ఐసీ బృందం పోలీసు సిబ్బందికి ఈ-ఫైలింగ్, డిజిటల్ సిగ్నేచర్ల వినియోగంపై సమగ్ర శిక్షణ ఇచ్చింది. పరిపాలనలో పారదర్శకత, కాగిత రహిత సేవల కోసమే ఈ శిక్షణని అదనపు ఎస్పీ తెలిపారు.
News December 11, 2025
భీమవరం: ‘జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ’

ఇంధనాన్ని పొదుపు చేసి భావితరాలకు వనరులను కాపాడాలని కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ అన్నారు.
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జాతీయ ఇంధన పొదుపు భాగంగా గురువారం వారోత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈనెల 14 నుంచి వారోత్సవాలు మహోద్యమంగా నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఇంధన పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు.
News December 11, 2025
రాత్రికి విశాఖ చేరుకోనున్నమంత్రి లోకేశ్

రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం రాత్రి విశాఖ చేరుకోనున్నారు. రాత్రి 9 గంటలకు ఎయిర్పోర్ట్కు చేరుకుని అక్కడి నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్తారు. డిసెంబరు 12న శుక్రవారం మధురవాడ ఐటీ హిల్స్లో పలు ఐటీ సంస్థల శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం కాపులుప్పాడలో జరిగే కాగ్నిజెంట్ కంపెనీ భూమి పూజ కార్యక్రమానికి హాజరవుతారు.


