News January 28, 2025
కామారెడ్డి: ‘దివ్యాంగులకు రుణాలు ఇవ్వాలి’

దివ్యాంగులకు పలు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని రాష్ట్ర వికలాంగుల పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు భూపతి కోరారు. ఆయన కామారెడ్డి లో మాట్లాడుతూ.. రాష్ట్ర దివ్యాంగుల సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రాయ్ చంద్రన్‌ను కలిసి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. దివ్యాంగులకు ప్రభుత్వం ద్వారా కావలసిన పరికరాలు అందించాలని కోరినట్లు చెప్పారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు వివరించారు.
Similar News
News February 18, 2025
అప్పులు చేయడానికి కేసీఆర్ రావాలా?: మంత్రి జూపల్లి

TG: కేసీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలకు దిగారు. ఆయన తిరిగి అధికారంలోకి రావాలని కోరుకునేది మళ్లీ అప్పులు చేయడానికేనా అని ప్రశ్నించారు. 10 ఏళ్ల తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఉందని దుయ్యబట్టారు. సర్పంచ్ బిల్లులు బకాయిలు పెట్టి ఇప్పుడు ఇవ్వట్లేదని అనడానికి కేటీఆర్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నాలుగు స్తంభాల ఆట నడిచిందని విమర్శించారు.
News February 18, 2025
విశాఖ: టెన్త్ క్లాస్ విద్యార్థిని ఆత్మహత్య

టెన్త్ క్లాస్ చదువుతున్న కే.సాస మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. అక్కయ్యపాలెం ఎన్. జి.జి..ఓఎస్.కాలనీ ఓ అపార్ట్మెంట్‌లో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. బాలిక సీతమ్మధారలోని ఓ స్కూల్‌లో చదువుతుంది. ఏమైందో తెలియదు గానీ మేడ మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హాస్పిటల్ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 18, 2025
వేములవాడలో 3 రోజులు జాతర.. మీరు వెళుతున్నారా?

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ఈనెల 25 నుంచి 27 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 25న రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి వస్త్రాలంకరణ, కోడె మొక్కులు నిర్వహిస్తారు. 26న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 27న స్వామివారి ఆర్జిత సేవలు ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.