News January 5, 2025

కామారెడ్డి: ద్వితీయ స్థానంలో నిలిచిన అనిల్

image

క్యాసంపల్లి ZPHS పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అనిల్ తేజ్, ఇటీవల ఆదిలాబాద్‌లో జరిగిన ఎనిమిదవ ఇంటర్ డిస్ట్రిక్ట్ మౌంటెన్ సైక్లింగ్ పోటీల్లో ప్రతిభ చూపి ద్వితీయ స్థానం సాధించారు. ఈ విజయంతో అనిల్ తేజ్ సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం అందుకున్నారు. పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు, గణిత ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు తాడ్వాయి శ్రీనివాస్ అభినందించారు.

Similar News

News January 9, 2025

NZB: రైల్వే స్టేషన్ ప్రాంతంలో వృద్ధుడు మృతి

image

నిజామాబాద్ వన్ టౌన్ పరిధిలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు SHO రఘుపతి బుధవారం తెలిపారు. రైల్వే స్టేషన్ ఎదురుగా దర్గా వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెంది ఉండటంతో స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వివరించారు.

News January 9, 2025

నిజామాబాద్: అరకిలో గంజాయి పట్టివేత

image

నిజామాబాద్ వినాయక నగర్ అమరవీరుల స్థూపం సమీపంలో బుధవారం గంజాయి ప్యాకెట్లను 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది దాడులు నిర్వహించి అరకిలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

News January 9, 2025

NZB: మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌లో కురగాయల వ్యాపారుల ఆందోళన

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని కమిషనర్ ఎదుట కూరగాయల వ్యాపారాలు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. స్థానిక అంగడి బజార్‌లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్‌లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు. రోజువారీ వ్యాపారాలు దెబ్బతింటాయని MIM నేతలు జిల్లా కలెక్టర్‌ను కలసి వినతిపత్రం అందజేశారు.