News March 26, 2025
కామారెడ్డి: ‘ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి’

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వరి ధాన్యం అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రబీ సీజన్లో ధాన్యం సేకరణకు సరిపడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
Similar News
News November 23, 2025
మెదక్: నేడు NMMS పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
News November 23, 2025
మహబూబాబాద్‌లో మహిళలకు అధ్యక్ష పదవులు!

మహబూబాబాద్ జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు జిల్లా అధ్యక్ష పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాయి. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలిగా మాలోత్ కవిత బాధ్యతలు చేపడుతుండగా, కాంగ్రెస్ అధిష్టానం సైతం డీసీసీ అధ్యక్షురాలిగా భూక్య ఉమాను నియమించింది. ఇద్దరు ఎస్టీ మహిళలను అధ్యక్షులుగా నియమించడం ద్వారా జిల్లా రాజకీయాల్లో వారి ప్రాముఖ్యత పెరిగింది.
News November 23, 2025
బాపట్ల: 108 వాహనాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పైలట్ పోస్ట్‌కు 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ , బ్యాడ్జ్ అర్హతలు కలిగి ఉండాలన్నారు. అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయంత్రం లోపు చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలోని 108 కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


