News February 20, 2025

కామారెడ్డి: నరేందర్ రెడ్డిని గెలిపించాలి: MP

image

కామారెడ్డి సత్యాగార్డెన్‌లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.

Similar News

News December 18, 2025

20న పాల్వంచలో జాబ్‌మేళా.. ఎస్‌బీఐ లైఫ్‌లో 150 పోస్టుల భర్తీ

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని వెల్లడించారు. ఎంపికైన వారికి నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు.

News December 18, 2025

పట్టు రైతులకు రూ.14 కోట్లు విడుదల

image

AP: రాష్ట్రంలో పట్టు పరిశ్రమపై ఆధారపడిన రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించి సిల్క్ సమగ్ర-2 పథకంలో భాగంగా రాష్ట్ర వాటా కింద రూ.14 కోట్ల నిధుల్ని పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేశామని మంత్రి వెల్లడించారు. ఈ నిధుల విడుదలతో 13,663 మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరినట్లు మంత్రి అచ్చెన్న తెలిపారు.

News December 18, 2025

రేషన్ కార్డుదారులకు అలర్ట్

image

TG: రేషన్ కార్డు లబ్ధిదారులు ఈ-కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. లేదంటే కొత్త సంవత్సరంలో సన్న బియ్యం కోటా నిలిపివేస్తామని ఆదేశాలు జారీ చేసింది. కార్డుల్లో ఉన్న వారు రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ యంత్రంలో వేలిముద్రలు వేసి కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పింది. ఐదేళ్ల లోపు పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.