News February 20, 2025
కామారెడ్డి: నరేందర్ రెడ్డిని గెలిపించాలి: MP

కామారెడ్డి సత్యాగార్డెన్‌లో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏడాది కాలంలో ఏకంగా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. మెదక్, NZB, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల MLC అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
Similar News
News March 27, 2025
రాజమండ్రి : వెంటిలేటర్‌పై అంజలి

రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నం చేసిన <<15888553>>అంజలి వెంటిలేటర్<<>> పైనే చికిత్స పొందుతోంది. దీనికి ఏజీఎం దీపక్‌నే కారణమని విద్యార్థిని తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాశ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి కుటుంబీకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆరోగ్యంలో ఏమాత్రం మెరుగులేదని వైద్యులు తెలిపారు. కాగా ఆమె తల్లిదండ్రులు తమ కూతురు బతికి వస్తుందని, రావాలని ఆశతో ఎదురుచూస్తున్నారు
News March 27, 2025
ఆ గాయం మానేందుకు 9 నెలలు: రష్మిక

తన కాలి గాయం మానేందుకు 9 నెలల సమయం పడుతుందని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. సోషల్ మీడియలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం కొంత కోలుకున్నానని, నడవగలుగుతున్నానని చెప్పారు. అలాగే తనకు ఎత్తైన ప్రదేశాలు, నీటి లోతు ఎక్కువగా ఉండే ప్రదేశాలంటే చాలా భయమని పేర్కొన్నారు. కాగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తుండగా రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయంతోనే ‘ఛావా’ ప్రమోషన్లకు హాజరయ్యారు.
News March 27, 2025
Stock Markets: బ్యాంక్, ఫైనాన్స్ షేర్ల జోరు

స్టాక్‌మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే లభించినప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. నిఫ్టీ 23,560 (73), సెన్సెక్స్ 77,570 (275) వద్ద ట్రేడవుతున్నాయి. PSU బ్యాంక్స్, PSE, CPSE, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, చమురు, కమోడిటీస్, ఇన్ఫ్రా, ఎనర్జీ షేర్లు ఎగిశాయి. ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు కుంగాయి. విప్రో, శ్రీరామ్ ఫైనాన్స్, హీరోమోటో, LT టాప్ గెయినర్స్.