News October 30, 2024
కామారెడ్డి: ‘నవంబర్ 9, 10వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు’
నవంబర్ 9, 10 వ తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ తెలిపారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లోని బిఎల్ఓ లకు ఆఫ్ లైన్ ద్వారా అర్హత గల యువతీ యువకులు దరఖాస్తులు చేసుకోవచ్చును.
Similar News
News October 31, 2024
నిజామాబాద్: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు విధించారు. బోయిన్పల్లి CI, SI వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సాయిలు సికింద్రాబాద్‌లోని ఓ ఫంక్షన్హల్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ హౌస్‌కింపింగ్ చేసే వ్యక్తి కూతురిపై 2019లో సాయిలు పలుసార్లు అత్యాచారం చేశాడు. 2020లో బాలిక గర్భందాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.
News October 31, 2024
జల్లాపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట కేంద్రంలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
News October 30, 2024
ఎల్లారెడ్డి: ‘డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి’
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగువేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు కోరారు. ఆయన ఈ విషయంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అధికారికంగా లేఖ రాశారు. రాష్ట్రంలో అత్యధిక వెనుకబడిన నియోజకవర్గం ఎల్లారెడ్డి అని ఆయన తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు.