News January 29, 2025

కామారెడ్డి: నిబంధనలు పాటించకపోతే చర్యలు: డీఈవో

image

పాఠశాల సమయాల్లో పదవీ విరమణ, సన్మాన కార్యక్రమాల నిర్వహణపై కొన్ని సూచనలు సలహాలను డీఈవో రాజు నోటీసుల రూపంలో జారీ చేశారు. పదవీ విరమణ పాఠశాల సమయాల్లో, పనివేళల్లో నిర్వహిస్తే బోధనకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ఈ విధంగా ఉపాధ్యాయుల వ్యవహరించడంతో పాఠశాల విద్యార్థులు, చుట్టుపక్కల, ఇతర పాఠశాలల్లో పని చేస్తున్న ఇతర ఉపాధ్యాయులతో హాజరవుతున్నారని, ఇది విద్యార్థుల సాధారణ బోధనకు చాలా ఆటంకం కలుగుతుందన్నారు.

Similar News

News November 10, 2025

జాతీయస్థాయి పోటీలకు గుంతకల్లు విద్యార్థిని ఎంపిక

image

శ్రీకాకుళంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. దీంతో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి ఐదుగురు మహిళా క్రీడాకారులు ఎంపికయ్యారు. గుంతకల్లు గవర్నమెంట్ జూనియర్ కాలేజీ విద్యార్థిని, వికెట్ కీపర్ బట్నపాడు అమూల్య జాతీయస్థాయి జట్టుకు ఎంపికైంది. ప్రిన్సిపల్ సాలాబాయి, కాలేజీ సిబ్బంది, పలువురు క్రీడాకారులు ఆమెను అభినందించారు.

News November 10, 2025

నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న అజహరుద్దీన్

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ నేడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గత నెల 31న ప్రభుత్వం ఆయన గవర్నర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అజహరుద్దీన్‌కు ప్రభుత్వం మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను కేటాయించింది. ఆయనతో కలుపుకొని ప్రస్తుతం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 15కు చేరింది. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.

News November 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 10, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.04 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.18 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.