News January 28, 2025

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.4.32 కోట్లు

image

KMR నియోజకవర్గ అభివృద్ధికి MRR గ్రాంట్స్ లో బీటి రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.4.32 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. క్యాంసం పల్లి నుంచి తండా వరకు రూ.76లక్షలు, PWD రోడ్ నుంచి అడ్లూర్ హరిజన వాడ వరకు రూ.1.33 కోట్లు, రాజంపేట్ నుంచి పెద్దయపల్లి వరకు రూ.1.25 కోట్లు, NH-7 నుంచి టెక్రియాల్ వరకు రూ.30 లక్షలు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News October 21, 2025

సంగారెడ్డి: రేపు ఉపాధ్యాయులకు శిక్షణ: డీఈఓ

image

జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ డివిజన్లలోనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్, సోషల్ బోధిస్తున్న ఉపాధ్యాయులకు డిజిటల్ లెర్నింగ్ పైన శిక్షణ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. సూచించిన కేంద్రాలలో శిక్షణకు ఉపాధ్యాయులు విధిగా హాజరు కావాలని సూచించారు.

News October 21, 2025

కలియతిరిగిన జగిత్యాల జిల్లా కలెక్టర్

image

జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సింగారావుపేట గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, పనులను వేగవంతం చేయాలని సూచించారు. రద్దయిన ప్రతిపాదనల స్థానంలో కొత్త ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీరామనగర్లో జీపీ భవన నిర్మాణం, ఇటిక్యాల గ్రామంలో అంగన్వాడీ భవనం, హెల్త్ సబ్‌సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. కార్యక్రమంలో మండలాధికారులు పాల్గొన్నారు.

News October 21, 2025

సంగారెడ్డి: రేపు మంత్రి దామోదర్ పర్యటన

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం జిల్లాలో పర్యటిస్తారని క్యాంపు కార్యాలయం తెలిపింది. ఉదయం 11 గంటలకు జిల్లా పోలీసులు ఆధ్వర్యంలో పీఎస్ఆర్ గార్డెన్‌లో జరిగే ఉచిత మెడికల్ క్యాంపుని ప్రారంభిస్తారని చెప్పారు. సాయంత్రం నాలుగు గంటలకు జోగిపేట మార్కెట్ కమిటీ ఆవరణలో వడ్ల కొనుగోలు ప్రారంభిస్తారని పేర్కొన్నారు.