News January 28, 2025
కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.4.32 కోట్లు

KMR నియోజకవర్గ అభివృద్ధికి MRR గ్రాంట్స్ లో బీటి రోడ్ల నిర్మాణం, మరమ్మతుల కోసం రూ.4.32 కోట్లు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. క్యాంసం పల్లి నుంచి తండా వరకు రూ.76లక్షలు, PWD రోడ్ నుంచి అడ్లూర్ హరిజన వాడ వరకు రూ.1.33 కోట్లు, రాజంపేట్ నుంచి పెద్దయపల్లి వరకు రూ.1.25 కోట్లు, NH-7 నుంచి టెక్రియాల్ వరకు రూ.30 లక్షలు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News February 18, 2025
బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిది: PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. బీజేపీతో గుజరాత్ బంధం విడదీయరానిదని, ఇది మరింత బలపడుతోందని తెలిపారు. అభివృద్ధి రాజకీయాలకు ఇది పెద్ద విజయం అని అభివర్ణించారు. GJలో 1912 వార్డులకు గాను బీజేపీ 1402, కాంగ్రెస్ 260, ఎస్పీ, ఆప్ కలిసి 236 వార్డులు గెలుచుకున్నాయి. 68 మున్సిపాలిటీల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 1, ఎస్పీ 2, ఇతరులు 3 చోట్ల విజయం సాధించాయి.
News February 18, 2025
చిత్తూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

చిత్తూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 18, 2025
MNCL: MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

రాష్ట్రంలో ఈ నెల 27న జరగబోయే పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీపై విశ్వాసం, భరోసా, ప్రజల పక్షాన బీజేపీ చేసిన పోరాటం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు బీజేపీ గెలుపునకు బాటలు అని పేర్కొన్నారు.