News March 18, 2025
కామారెడ్డి: నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో మిషన్ భగీరథ, మెడికల్ కళాశాల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
Similar News
News November 15, 2025
మెదక్: నేడు జిల్లాలో కవిత పర్యటన ఇదే

మెదక్ జిల్లాలో రెండవ రోజు శనివారం కల్వకుంట్ల కవిత జాగృతి జనం బాట షెడ్యూల్ ఈవిధంగా ఉంది. హవేలి ఘన్పూర్ మండలం కూచన పల్లిలో పాడి రైతులతో సమావేశం
2.రమేష్ కుటుంబ సభ్యుల పరామర్శ,
3.మెదక్లో ప్రెస్ మీట్,
4.మేధావులతో సమావేశం, బూరుగుపల్లి, రాజుపేట, వాడి, దూప్ సింగ్ తండాలో వరద బాధితుల పరామర్శ, 5.పొలంపల్లిలో కేవల్ కిషన్, చిన్నశంకరంపేట అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తారు.
News November 15, 2025
సనాతనం అంటే ఏంటి? అది ఏం బోధిస్తుంది?

సనాతనం అంటే శాశ్వతంగా, నిరంతరం ఉండేది అని అర్థం. అందుకే దీన్ని సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మ శాస్త్రాలు మనిషికి ముఖ్యంగా రెండు విషయాలను బోధిస్తున్నాయి. అవి సరైన జీవన విధానం, జీవిత లక్ష్యం. ఈ రెండూ తెలియకుండా జీవించడం వ్యర్థం. అందుకే జీవన విధానాన్ని, జీవిత లక్ష్యాన్ని ధర్మార్థ కామ మోక్షాలు అనే పురుషార్థాల ద్వారా ఎలా పొందవచ్చో మన శాస్త్రాలు స్పష్టంగా నిర్దేశిస్తున్నాయి. <<-se>>#Sanathanam<<>>
News November 15, 2025
బిహార్: ఓట్ షేరింగ్లో ఆర్జేడీనే టాప్

బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఓట్ షేర్ పరంగా చూసుకుంటే తేజస్వీ పార్టీ ఆర్జేడీ(23%)దే అత్యధికం. అయినప్పటికీ ఈ పార్టీ 25 స్థానాల్లోనే గెలిచింది. అటు 20.08% ఓట్లతో బీజేపీకి అత్యధికంగా 89 సీట్లు, 19.25% ఓట్లతో జేడీయూకు 85 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు 8.71శాతం(6సీట్లు) ఓట్లు రాగా, ఇతరులకు 17శాతం రావడం గమనార్హం.


