News July 30, 2024
కామారెడ్డి: నేడు రైతుల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు

కామారెడ్డి జిల్లాలో రెండో విడత రుణమాఫీ 24,816 మంది రైతులకు వర్తించిందని జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. మంగళవారం రైతుల ఖాతాలో రూ.211.72 కోట్లు జమకానున్నాయని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం రెండో విడత రుణమాఫీ నిధులను విడుదల చేస్తారన్నారు.
Similar News
News November 28, 2025
ర్యాలీలకు అనుమతి తప్పనిసరి: NZB సీపీ

నిజామాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎవరైనా ర్యాలీలు నిర్వహించాలంటే సంబంధిత రిటర్నింగ్ అధికారి, పోలీస్ అధికారుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించడం చట్టపరమైన చర్యలకు కారణం అవుతుందన్నారు. జిల్లా పరిధిలో డీజేల వాడకం పూర్తిగా నిషేధం అన్నారు.
News November 28, 2025
NZB: సమస్యలపై పోరాడే వారిని బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలి

న్యాయం కోసం పాటుపడే న్యాయవాదుల సమస్యలపై పోరాడే వ్యక్తులకు జనవరిలో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం NZB జిల్లా బార్ అసోసియేషన్లో నిర్వహించిన న్యాయవాదుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులపై జరుగుతున్న హత్యలు, అక్రమాలు దాడులు మొదలగునవి అరికట్టడానికి అడ్వకేట్ ప్రొటెక్షన్ ఆక్ట్ బిల్ ఎంతో అవసరం అన్నారు.
News November 28, 2025
NZB: రెండో రోజు 450 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో రెండో రోజు శుక్రవారం 184 సర్పంచి స్థానాలకు 164 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 286 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడతలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.


