News August 20, 2024

కామారెడ్డి: నేడు వాణిజ్య వ్యాపార సంస్థల బంద్

image

కామారెడ్డి చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పట్టణ వర్తక వాణిజ్య, వ్యాపార, సంఘాలు నేడు బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నేడు అన్ని వ్యాపార సంస్థలు, స్కూల్స్ కాలేజీలు స్వచ్ఛందంగా బంద్ చేసి ఉదయం 9 గంటలకు పట్టణ కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.

Similar News

News November 12, 2025

NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

image

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.

News November 12, 2025

NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

image

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.

News November 12, 2025

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఎంపీ అర్వింద్

image

ఇందూరు పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న జిల్లా నేతలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఇందూరు ప్రజలే బుద్ధి చెప్పాలని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.