News March 7, 2025
కామారెడ్డి: నేరాల అదుపునకు పోలీసుల కృషి అభినందనీయం: ఎస్పీ

కామారెడ్డి జిల్లాలో నేరాల అదుపునకు పోలీస్ సిబ్బంది తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎస్పీ సింధుశర్మ అన్నారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని దొంగతనాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.
Similar News
News December 23, 2025
నాడు ఊరిలో సఫాయీ.. నేడు ఊరికే సర్పంచ్

TG: నిర్మల్ జిల్లా తానూర్ మండలం తొండాలకి చెందిన మిరేకర్ మాధవ్ ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని నిరూపించారు. 19 ఏళ్ల పాటు గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆయన పోటీ చేసి గెలుపొందారు. నిన్న మాధవ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సఫాయీ కార్మికుడిగా ఉన్న తనను సర్పంచ్ చేసిన గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు.
News December 23, 2025
నగరిలో టీడీపీ నేత అక్రమాలు: YCP

నగరి ఎమ్మెల్యే అండతో టీడీపీ నేత భారీగా రేషన్ అక్రమ రవాణా చేశారని వైసీపీ ఆరోపించింది. నిండ్రలోని నెట్టేరి వద్ద తనిఖీల్లో 4 టన్నుల రేషన్ బియ్యంతో టీడీపీ ఎస్సీ సెల్ నేత అల్లిముత్తు పట్టుబడినట్లు తెలిపింది. తర్జనభర్జనల తర్వాత అల్లిముత్తు , కార్తీక్ , విక్రమ్పై పోలీసులు కేసు నమోదు చేశారని, సీజ్ ద షిప్ అనే పవన్ కళ్యాణ్ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించింది.
News December 23, 2025
జుట్టు ఆరోగ్యం కోసం ఏం తినాలంటే?

జుట్టు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే దాన్ని సంరక్షించడంతో పాటు పోషకాహారం తీసుకోవడం కూడా ముఖ్యం. దీనికోసం బాదం, చిలగడదుంప, గుడ్డు, శనగలు, పాలకూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో ఉండే బయోటిన్, ఐరన్, ఫోలేట్, విటమిన్ C ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు కుదుళ్లకు ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. జుట్టు రాలిపోతున్నా, పలచగా ఉన్నా ఈ ఫుడ్స్ ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


