News February 5, 2025
కామారెడ్డి: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా..!

పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామగ్రిని మండల కేంద్రాలకు పంపించి భద్రపరిచారు. కామారెడ్డి జిల్లాలో 536 గ్రామ పంచాయతీలున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావాహులు పార్టీ నేతలను కలుస్తూ తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News October 19, 2025
సామర్లకోటలో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1,026 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున జిల్లా వర్షపాతం 48.9 గా నమోదైంది. అత్యధికంగా సామర్ల కోటలో 132.4, అత్యల్పంగా కరపలో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లో కూడా వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు.
News October 19, 2025
ములుగు: మావోయిస్టు పార్టీకి పెద్ద సవాళ్లు!

వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోంది. నక్సలైట్ సంస్థ నడిపే పొలిట్ బ్యూరో కూడా దాదాపు ఖాళీగానే ఉంది. పోలీట్ బ్యూరో కేంద్ర కమిటీలో ఒకప్పుడు 17 మందికి పైగా సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8 మంది కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలిట్ బ్యూరోలో మిసిర్ బెస్రా, తిరుపతి@దేవ్ జీ, గణపతి, సీసీ కమిటీ సభ్యులు మాడవి హిడ్మా, రామన్న, గణేశ్, ఉదయ్ ఉన్నారు.
News October 19, 2025
మళ్లీ పంచాయతీ రాజ్ చట్ట సవరణ!

TG: స్థానిక ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్నా పోటీ చేసేందుకు అర్హులని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. దీని కోసం పంచాయతీ రాజ్ చట్టం-2018, 21(ఏ)ను సవరణ చేయాల్సి ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆ శాఖను ఆదేశించింది. ఈ బిల్లును గవర్నర్ ఆమోదిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లో అమల్లోకి వస్తుంది. గతంలో గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడం, స్థానిక ఎన్నికలకు చేసిన రిజర్వేషన్లు తదితరాల కోసం చట్టాన్ని సవరించారు.