News October 23, 2024
కామారెడ్డి: పిడుగుపాటుతో కొడుకు మృతి.. తండ్రికి గాయాలు

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికిచెందిన మంద వెంకటి(25) పిడుగుపాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ శివారులోని వడ్ల కొనుగోలు కేంద్రంవద్ద తండ్రి నాగభూషణం కొడుకుతో కలిసి పని చేస్తుండగా అకాల వర్షం రావడంతో పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిల్చుని ఉండగా పిడుగు పడింది. దీంతో వెంకటి మృతి చెందగా నాగభూషణం, పక్కనే పనులు చేస్తున్న ధ్యానబోయిన కాశవ్వ, అనిల్కు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News November 20, 2025
NZB: మూగజీవాలను సైతం వణికిస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలలో వణికిస్తున్న చలిపులి మూగజీవాలను సైతం వదలడం లేదు. చలికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా గజగజ వణుకుతున్నాయి. కొందరు చలిమంట వేసుకుంటూ చలి నుంచి ఉపశమనం పొందుతుండగా వారు వేసుకున్న చలిమంట వద్ద మూగజీవాలు సేదదీరుతున్నాయి. NZB నగరంలో రెండు కుక్క పిల్లలు వెచ్చదనం కోసం ఇలా చలి మంటకాచుకుంటున్న దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
News November 20, 2025
SRSP 24 గంటల్లో 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 9,338 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం ఉదయం తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీరు పోతుండగా సరస్వతీ కెనాల్కు 650, మిషన్ భగీరథకు 231 వదిలామన్నారు. ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో 80.501 TMCల నీరు నిల్వ ఉందన్నారు.
News November 20, 2025
ముప్కాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

తూప్రాన్ పట్టణ పరిధి కరీంగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై శివానందం తెలిపారు. ముప్కాల్ గ్రామానికి చెందిన పన్నీర్ వెంకటేష్(24) ప్రేమ వివాహం చేసుకొని హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వెళుతుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.


