News October 23, 2024
కామారెడ్డి: పిడుగుపాటుతో కొడుకు మృతి.. తండ్రికి గాయాలు
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికిచెందిన మంద వెంకటి(25) పిడుగుపాటుతో మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. గ్రామ శివారులోని వడ్ల కొనుగోలు కేంద్రంవద్ద తండ్రి నాగభూషణం కొడుకుతో కలిసి పని చేస్తుండగా అకాల వర్షం రావడంతో పక్కనే ఉన్న వేపచెట్టు కింద నిల్చుని ఉండగా పిడుగు పడింది. దీంతో వెంకటి మృతి చెందగా నాగభూషణం, పక్కనే పనులు చేస్తున్న ధ్యానబోయిన కాశవ్వ, అనిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News November 10, 2024
పిట్లం: భానుడు.. చెరువులో విద్యుత్ వెలుగులా..!
సాయంత్రం వేళ సూర్యాస్తమయ సమయాన సూర్యుడి ప్రతిబింబం చెరువు నీటిలో విద్యుత్ బల్బు మాదిరి సాక్షాత్కరించింది. ఆకాశమంతా ఎర్రని కాంతులను వెదజల్లుతూ.. మరో వైపు నీటిలో దీప కాంతిని ప్రసరిస్తూ కనువిందు చేసింది. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. పిట్లంలోని గ్రామ చెరువు వద్ద శనివారం ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించారు.
News November 10, 2024
ధాన్యం అమ్మాలంటే కష్ట పడాల్సిందే..!
భూమి చదును చేసి, నారు మడులు సిద్ధం చేసుకొని, నాటు వేసి.. పంట చేతికొచ్చి.. విక్రయించి చేతికి డబ్బులు వచ్చే దాక రైతుకు అన్ని కష్టాలే. కొన్ని చోట్ల ముందస్తు వరి కోతలు షురూ కాగా..మరి కొన్ని చోట్ల కోతలు పూర్తయ్యాయి. పంట నూర్పిడి చేసిన ధాన్యాన్ని రోడ్ల పై ఎండ బెట్టారు. ధాన్యంలో తేమశాతం తగ్గేలా ఓ రైతు ధాన్యాన్ని తిరగేస్తున్న దృశ్యాన్ని ‘WAY2NEWS’ పిట్లంలో హై వే-161 వద్ద తన కెమెరాలో బంధించింది.
News November 10, 2024
KMR: యువకుడి ఆత్మహత్య.. కేసు నమోదు
ఆర్థిక సమస్యలతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివనగర్ మండలంలో జరిగింది. ఎస్సై రంజిత్ కథనం ప్రకారం.. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన మొగ్గం శ్రావణ్ (24) కొద్ది రోజులుగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. శుక్రవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.