News April 18, 2024

కామారెడ్డి: పొద్దంతా ఎండ.. రాత్రికి వాన

image

కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News January 11, 2025

చింతకుంట అటవీ ప్రాంతంలో ఆవు పై చిరుత పంజా

image

మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన గజ్జి నారాయణ ఆవులు మేత మేయడానికి వెళ్లగా చిరుత ఆవుపై దాడి చేసింది. పెంపుడు కుక్కలు అరవడంతో ప్రాణాలతో బయట పడ్డట్టు బాధితుడు తెలిపారు. అటవీ ప్రాంతంలో చిరుతలు ఉన్నట్టు గతంలో గుర్తించినట్లు అటవీ శాఖ బీట్ ఆఫీసర్ హుస్సేన్ తెలిపారు. కాపరులు గుట్ట పైకి వెళ్ల కూడదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 11, 2025

NZB: ప్రభుత్వ ఆదేశాలు అమలు చేస్తాం: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసేందుకు జిల్లా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సీఎస్, మంత్రులు హైదరాబాద్‌లో నిర్వహించిన కలెక్టర్‌ల సదస్సులో పాల్గొన్న అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 26 తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు అమలు చేస్తోందని, వాటిని విజయవంతం చేసేలా పని చేస్తామన్నారు.

News January 10, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి:DMHO

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు రోగులకు మెరుగైన సేవలందించాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో పీహెచ్‌సీ వైద్యులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతిఒక్కరూ సమయపాలన పాటించాలని, లక్ష్యం మేరకు ఓపీ సేవలందించాలని సూచించారు. ఆసుపత్రిలోకి వచ్చే రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయాలని, ప్రతి ఓపిని టార్గెట్‌కు అనుగుణంగా చూడాలని తెలిపారు.