News April 18, 2024
కామారెడ్డి: పొద్దంతా ఎండ.. రాత్రికి వాన
కామారెడ్డి జిల్లాలో బుధవారం భానుడు భగభగ మండాడు. డోంగ్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. పొద్దంతా మండే ఎండతో అల్లాడిన జనం రాత్రి కురిసిన వానతో కొంతమేర ఉపశమనం పొందారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రాంతంలో 11 మిల్లీమీటర్లు, బీబీపేటలో 3.5, సదాశివనగర్ లో 3.3, పాతరాజంపేట 3, మాచారెడ్డిలో 1.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని మిగితా ప్రాంతాల్లో 41 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది.
Similar News
News September 17, 2024
వర్ని: కొడవలితో భార్య గొంతుకోసి హత్య చేసిన భర్త
భార్య గొంతుకోసి భర్త హత్య చేసిన ఘటన వర్నిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన పెంటవ్వ(46), భర్త బాలయ్య మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న బాలయ్య క్షణికావేశంలో కొడవలితో ఆమె గొంతు కోయడంతో పెంటవ్వ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 17, 2024
ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 17, 2024
కామారెడ్డిలో రికార్డు స్థాయి ధర పలికిన లడ్డూ
కామారెడ్డిలో వినాయకునికి లడ్డూ రికార్డు ధర పలికింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డులోని సంకష్ఠ గణపతి దేవాలయంలో నిర్వాహకులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. కాగా జీఆర్ఎల్ సంస్థ ప్రతినిధి సంతోష్ రూ.2.79 లక్షలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.