News February 19, 2025

కామారెడ్డి: పోలింగ్ కేంద్రం వివరాలతో అభ్యర్థుల SMS ప్రచారం

image

ఎమ్మెల్సీ ఎన్నికలు అంటేనే నియోజకవర్గాలు చాలా పెద్ద పరిధి కలిగి ఉంటుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలుస్తూ ప్రచారం చేయడం పెద్ద సవాలే. అయితే ఇప్పుడు అభ్యర్థులు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొత్తగా పోలింగ్ వివరాలు తెలుపుతూ.. తమకే మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని SMSరూపంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మీకు మెసేజ్‌లు వస్తున్నాయా..? కామెంట్ చేయండి.

Similar News

News November 18, 2025

చిత్తూరు జిల్లాలో 27మందిపై క్రమశిక్షణ చర్యలు

image

చిత్తూరు జిల్లా సచివాలయ సిబ్బందికి కలెక్టర్ సుమిత్ కుమార్ షాక్ ఇచ్చారు. ‘జిల్లాలో 612సచివాలయాల్లో 4,477మంది పనిచేయాల్సి ఉంది. 4,040మంది విధులు నిర్వహిస్తుండగా 437మంది డ్యూటీకి రావడం లేదు. ఇందులో 152మంది మెడికల్ లీవ్‌, 251 మంది డిప్యుటేషన్‌పై వేరేచోట పనిచేస్తున్నారు. అనధికారికంగా సెలవుపై ఉన్న 27మందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. మెడికల్ లీవు వాళ్లను మరోసారి చెక్ చేయాలి’ అని కలెక్టర్ ఆదేశించారు.

News November 18, 2025

ఏలూరు: ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉచిత సివిల్స్ శిక్షణ

image

ఏలూరు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు విజయవాడలో ఉచిత సివిల్స్, మెయిన్స్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి నాగరాణి సోమవారం తెలిపారు. ఈనెల 17 నుంచి 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్ 5న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 10వ తేదీ నుంచి అర్హులకు ఉచిత వసతి, శిక్షణ ఇస్తారని ఆమె పేర్కొన్నారు.