News March 3, 2025
కామారెడ్డి: ప్రజావాణికి 52 ఫిర్యాదులు: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, రెండు పడక గదుల ఇళ్లు, రైతు భరోసా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మున్సిపల్ రోడ్లు ఆక్రమణ, మొత్తం 52 అంశాలపై ఫిర్యాదులు అందాయి. పెండింగులో ఉన్న అర్జీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
Similar News
News November 3, 2025
మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.
News November 3, 2025
చిరకాల విజయం తర్వాత కాబోయే భర్తతో స్మృతి

ప్రపంచకప్ విజయం తర్వాత భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన కాబోయే భర్త, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్తో కలిసి కప్పును పట్టుకున్న ఫొటో వైరల్ అవుతోంది. ఈనెలలోనే వీరిద్దరూ <<18043744>>పెళ్లి<<>> చేసుకోనున్నారు. కెరీర్లో అత్యున్నత విజయాన్ని సాధించిన ఈ సంతోష క్షణాన్ని ప్రియమైన వ్యక్తితో పంచుకోవడం అద్భుతంగా ఉందని అభిమానులు కొనియాడుతున్నారు.
News November 3, 2025
ఊట్కూర్: మాదాసి కురువలకు ఎస్సీ కుల ధ్రువీకరణ ఇవ్వొద్దని ఫిర్యాదు

ఉట్కూర్ అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో మదాసీ కుర్వలకు ఎస్సీ కుల ద్రువీకరణ పత్రాలు ఇవ్వొద్దని అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ కులం ఇంతకు ముందు బీసీ వర్గానికి చెందినదని, తెలంగాణలో మదాసీ కుర్వ అనే వర్గం లేదని వివరించారు. దీనిపై అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ఫిర్యాదును పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం సభ్యులు శంకర్,కార్యదర్శి కొండన్ భరత్ పాల్గొన్నారు.


