News February 17, 2025
కామారెడ్డి: ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వెల్లువ

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజావాణిలో 58 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు.
Similar News
News April 17, 2026
గుంటూరు జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. గుంటూరు జిల్లాలో మొత్తం 7,34,672 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 3,54,330 మంది ఉండగా, మహిళలు 3,80,306 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 36 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
కర్నూలు: ఘోర ప్రమాదలో 9కి చేరిన మృతుల సంఖ్య

మంత్రాలయం(M) చిలకలడోణ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో మరొకరు మృతి చెందారు. కర్ణాటక నుంచి మంత్రాలయానికి సరకు రవాణా వాహనంలో 22 మంది భక్తులు వెళ్తుండగా సిమెంట్ లారీని ఢీకొట్టి 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. 12 మంది తీవ్రంగా గాయాపడ్డారు. వారిలో తేజశ్విని(15) కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మరణించారు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది.
News April 17, 2026
ప్రభాస్ కటౌట్‌కు తగ్గట్టుగా ‘ఫౌజీ’!

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ వార్ డ్రామా ‘ఫౌజీ’పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్ కోసం డైరెక్టర్ హను మునుపెన్నడూ లేని విధంగా నెక్స్ట్ లెవెల్ మాస్ ఎలివేషన్స్, సాలిడ్ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. డార్లింగ్ కటౌట్‌కు తగ్గట్టుగా మాస్ యాంగిల్‌ను హను చూపించబోతున్నారని సమాచారం. ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


